నీరవ్ మోదీ దొరికాడు.. లండన్‌లో అరెస్ట్

Wed,March 20, 2019 03:11 PM

Neerav Modi arrested in London extradition process may start soon

లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన రూ.13 వేల కోట్ల స్కాంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని బుధవారం లండన్‌లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని లండన్‌లోని ఓ కోర్టులో హాజరు పరిచారు. అతన్ని ఇండియాకు అప్పగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యే అతడు లండన్ వీధుల్లో తిరుగుతూ కెమెరా కంట పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ పీఎన్‌బీ స్కాం బయటపడక ముందే నీరవ్ మోదీ దేశం వదిలి పారిపోయాడు. అతని మేనమామ, ఈ స్కాంలో మరో నిందితుడైన మెహుల్ చోక్సీ కూడా దేశం వదిలి వెళ్లిపోయాడు. అతడు కరీబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్నాడు. అంతకుముందే ఆ దేశ పౌరసత్వం తీసుకున్న చోక్సీ.. ఈ మధ్యే భారత పాస్‌పోర్ట్‌ను కూడా వదులుకున్నాడు. నీర‌వ్ మోదీకి చెందిన 173 పేయింటింగ్స్‌, 11 ల‌గ్జ‌రీ కార్ల‌ను వేలం వేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ కోర్టు అనుమ‌తి తీసుకున్న‌ది.

2390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles