నాగాలాండ్‌లో నువ్వా నేనా ?

Sat,March 3, 2018 11:04 AM

neck and neck fight in Nagaland assembly polls

కోహిమా: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి. అక్కడ బీజేపీ కూటమి జోరు ప్రదర్శిస్తోంది. నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్) పార్టీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న పోటీ నడుస్తున్నది. నాగాలాండ్‌లో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రసివ్ పార్టీతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకున్నది. ఇప్పుడీ కూటమి నాగాలాండ్‌లో కొత్త ఆశలకు ప్రాణం పోస్తున్నది. బీజేపీ కూటమి 31, ఎన్‌పీఎఫ్ కూటమి 27 సీట్లలో దూసుకెళ్తున్నది. ఈ రాష్ట్రంలో 59 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు సీఎంగా చేసిన నెపియో రియోను ముందే విజేతగా ప్రకటించారు. ఆయన ఉత్తర అంగామి నియోజకవర్గం నుంచి విజేతగా వెల్లడించారు.

1954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles