మోదీ-అమితాబ్ లైవ్ షో

Tue,May 24, 2016 11:36 AM

NDA second anniversary, Modi and Big B to host live show

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావాస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగానే దూర్‌దర్శన్‌లో అయిదు గంటలు లైవ్ షో చేయనున్నారు. క్యాబినెట్ మంత్రులతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గోనున్నారు. ఈ నెల 28న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రధాని మోదీతో పాటు క్యాబినెట్ సభ్యులు మాట్లాడుతారు. ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసారం అవుతుంది.

1214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles