24న ఎన్డీయే నేతల భేటీ

Sat,November 21, 2015 07:19 AM

NDA leaders to meet on Nov 24 to discuss Winter Session

న్యూఢిల్లీ : మరో ఐదు రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ఈ నెల 24న సమావేశం కానున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ నెల 25న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు ఒకరోజు ముందు ఈ భేటీ జరుగనుంది. దీంతోపాటు 25న అన్ని పార్టీలతో ప్రభుత్వం కూడా సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ వంటి కీలక బిల్లులతోపాటు పలు అంశాలు ఈసారి కూడా ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు అడ్డుపడే అవకాశమున్న నేపథ్యంలో ఈ సమావేశం జరపాలనే ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్డీయే సమావేశం ఈ నెల 18నే జరగాల్సి ఉన్నా.. వీహెచ్‌పీ నేత అశోక్‌సింఘాల్ మృతితో వాయిదా పడింది.

798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles