వ‌య‌నాడ్‌లో రీపోలింగ్‌కు డిమాండ్‌

Tue,April 23, 2019 11:39 AM

NDA candidate from Wayanad Thushar Vellappally demands re polling after EVM malfunction

హైద‌రాబాద్: కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స్థానం నుంచి తుషార్ వెల్ల‌ప‌ల్లి ఎన్డీఏ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ కొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. దీంతో ఎన్డీఏ అభ్య‌ర్థి తుషార్‌.. రీపోలింగ్ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ముప్ప‌నాడ్ పంచాయితీలోని ఓ స్కూల్‌లో ఉన్న ఈవీఎం మొరాయించింద‌ని, రెండు సార్లు బ‌ట‌న్ నొక్కినా ఓటు ప‌డ‌డం లేద‌ని తుషార్ ఆరోపించారు.

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles