దిండుతో.. రోహిత్ తివారిని హ‌త్య చేశారు

Fri,April 19, 2019 05:39 PM

ND Tiwaris son Rohit Shekhar likely murdered with pillow

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖ‌ర్ తివారిది స‌హ‌జ మ‌ర‌ణం కాదు అని పోస్టుమార్ట‌మ్‌లో తేలింది. రోహిత్‌ను హ‌త్య చేసి ఉంటార‌ని, అది కూడా ఓ దిండుతో చంపి ఉంటార‌ని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. బుధ‌వారం రోజున 40 ఏళ్ల రోహిత్ తివారి చ‌నిపోయాడు. అత‌ను గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు ముందుగా తెలిపారు. అయితే కేసు విచార‌ణ చేప‌ట్టిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కొత్త కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు. మ‌ర్డ‌ర్ కేసును కూడా న‌మోదు చేశారు. రోహిత్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయ‌న కుటుంబీకుల‌ను, ప‌నివాళ్ల‌ను విచారించారు. భార్య అపూర్వ ఇంట్లో లేద‌ని పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని డిఫెన్స్ కాల‌నీలో ఉన్న రోహిత్ ఇంటి వ‌ద్ద ఏడు సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో రెండు కెమెరాలు ప‌నిచేయ‌డం లేదు. ఏప్రిల్ 12వ తేదీను ఓటు వేసేందుకు ఉత్త‌రాఖండ్ వెళ్లిన రోహిత్.. ఆ త‌ర్వాత ఏప్రిల్ 15న ఇంటికి వ‌చ్చాడు. తాగిన మైకంలో అత‌ను గోడ సాయంతో ఇంట్లోకి వ‌స్తున్న‌ట్లు ఓ సీసీటీవీలో ఉంద‌ని పోలీసులు చెప్పారు. ఎన్డీ తివారి కుమారుడిన‌ని చెప్పుకునేందుకు రోహిత్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశాడు. కోర్టులో ఆర్నేళ్ల పాటు ఆ కేసులో పోరాటం చేశాడు. చివ‌ర‌కు డీఎన్ఏ రిపోర్ట్‌ల‌ను కూడా ప్ర‌జెంట్ చేశాడు. 2014లో ఢిల్లీ కోర్టు.. ఎన్డీ తివారి కుమారుడే రోహిత్ అని తీర్పు చెప్పింది.

2600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles