27 వాహనాలకు నక్సల్స్‌ నిప్పు

Wed,May 1, 2019 10:43 AM

Naxals have set ablaze 27 machines and vehicles in Gadchiroli district

ముంబై : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 27 వాహనాలకు నక్సల్స్‌ నిప్పు పెట్టారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. 27 వాహనాలకు నిప్పు పెట్టడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కాంట్రాక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జనవరిలో కూడా కుర్ఖేడాలో పలు వాహనాలకు నక్సల్స్‌ నిప్పు పెట్టారు. ఏప్రిల్‌ 11వ తేదీన గడ్చిరోలిలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే.1504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles