కెప్టెన్ కాళ్లు మొక్కిన సిద్ధూ

Thu,March 16, 2017 10:54 AM

Navjot Sidhu touches captain Amarinder Singhs feet

లుథియానా: పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. పంజాబ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన‌ మాజీ క్రికెట‌ర్ సిద్ధూ కూడా క్యాబినెట్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత సిద్ధూ కెప్టెన్ అమ‌రీంద‌ర్ కాళ్లు మొక్కారు. వాస్త‌వానికి పంజాబ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో సిద్ధూ చివ‌రి నిమిషాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో సిద్ధూకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలున్నాయ‌ని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇవాళ జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో సిద్ధూకు డీప్యూటీ సీఎం ప‌ద‌వి ద‌క్కిన‌ట్లు స్ప‌ష్టం కాలేదు. ఇవాళ రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన వేడుక‌లో గవర్నర్ వీపీ సింగ్ బద్నోర్ సీఎంతో పాటు మంత్రుల‌కు ప్రమాణస్వీకారం చేయించారు. పంజాబ్ రాష్ట్రానికి అమ‌రీంద‌ర్ సింగ్ 26వ ముఖ్య‌మంత్రి. సీఎంగా అమ‌రీంద‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఇది రెండ‌వ సారి. 2002-2007 మ‌ధ్య ఆయ‌న తొలిసారి సీఎంగా చేశారు. ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 77 సీట్ల‌ను గెలుచుకున్న‌ది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో లూథియానాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమరీందర్‌సింగ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

2169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles