వరుస ఉపన్యాసాలు.. దెబ్బతిన్న మంత్రి స్వరం

Thu,December 6, 2018 03:32 PM

Navjot Sidhu Injures Vocal Cords After 17 Days Of Back To Back Speeches in election campaigns

న్యూఢిల్లీ : ఎన్నికలు వస్తే చాలు.. పార్టీల ముఖ్య నేతల స్వరాలు పోవాల్సిందే. ఆయా నియోజకవర్గాలను చుట్టేస్తూ తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం వరుస ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటారు. అలసట వచ్చినా ఆగకుండా నిరాటకంగా మాట్లాడుతూ ప్రజల మనసులను దోచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయి.. ఎన్నికల పర్వం ముగియగానే స్వరం నొప్పులు, జ్వరాలు, జలుబులతో బాధపడుతూ ఉంటారు.

పంజాబ్ మంత్రి నవజోత్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఐదు రాష్ర్టాల్లో పర్యటించారు. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ మిజోరం రాష్ర్టాల్లో 17 రోజులు విస్తృతంగా పర్యటించి.. 70 బహిరంగ సభల్లో వరుస ఉపన్యాసాలు ఇచ్చారు. విరామం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడంతో సిద్ధూ గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కనీసం ఐదు రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపింది. గొంతు నొప్పికి వైద్యులు చికిత్స చేశారు. దీని నుంచి ఉపశమనం కలిగే వరకు విశ్రాంతి తీసుకుంటే మంచిదని వైద్యులు చెప్పారు.

2161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles