రైతులకు సొంత డబ్బు పంపిణీ చేసిన నవజ్యోత్ సిద్దూ

Wed,October 4, 2017 02:32 PM

Navjot Sidhu gives Rs 15 lakhs each to farmers whose losses crops


పంజాబ్ : పంజాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పంట నష్టపోయిన రైతులకు ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సిద్దూ నష్టపరిహారం అందజేశారు. నవజ్యోత్ సిద్దూ అమృత్‌సర్‌లోని రాజసాన్సీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు రూ. 15 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేశారు. నవజ్యోత్ సిద్దూ తన సొంత డబ్బులను రైతులకు పరిహారంగా అందజేయడం విశేషం. రైతులకు అండగా నిలిచేందుకు తనవంతుగా ఆర్థికసాయం అందించానని నవజ్యోత్ సిద్దూ తెలిపారు. తాను అందజేసిన డబ్బు రైతులకు ఆర్థికంగా బాసటగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో 202 ఎకరాల్లో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే.
navjyotsidhu-farmers1

646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles