HomeLATEST NEWSNaval Officer Dies In Fire Onboard INS Vikramaditya In Karnataka

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం.. అధికారి మృతి

Published: Fri,April 26, 2019 04:42 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
కర్ణాటక: అగ్నిప్రమాదంలో ఓ నావల్ అధికారి మృతిచెందాడు. కర్ణాటకలోని కర్వార్ ఓడ రేవుకు చేరుకుంటున్న సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం సంభవించింది. కంపార్ట్‌మెంట్‌పై చెలరేగిన మంటలను ఆర్పేందుకు లెఫ్ట్‌నెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ధైర్యంగా చర్యలు తీసుకున్నట్లు నేవీ ఓ ప్రకటనలో తేలిపింది. మంటలు అదుపులోకి వచ్చే సమయానికి పొగ కారణంగా అధికారి అపస్మారకస్థితిలో వెళ్లాడు. వెంటనే చికిత్స నిమిత్తం నేవీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. కాగా షిప్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకముందే సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
918
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology