ఏపీ వేదికగా మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు

Fri,January 13, 2017 07:14 PM

National Women�s Parliament-2017� to be held in Amaravati

ఏపీ: -2017కు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. ఏపీ రాజధాని నగరం అమరావతిలో ఫిబ్రవరి 10 నుంచి మూడు రోజుల పాటు సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర సభాపతి కోడెల శివప్రసాద్ తెలుపుతూ.. సదస్సుకు ఆఫ్రికా, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల ప్రతినిధులతో పాటు 29 రాష్ర్టాలకు చెందిన స్పీకర్లు, పార్లమెంట్, అసెంబ్లీ మహిళా సభ్యులందరూ హాజరుకానున్నట్లు తెలిపారు. వీరితో పాటు 10 వేల మంది విద్యార్థినులు సైతం సదస్సుకు రానున్నట్లు చెప్పారు.

మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఏపీ వేదిక కావడం సంతోషమని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాబు స్పందిస్తూ.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్ కల్పించారు. ఆ విధానాన్ని దేశ వ్యాప్తంగా అనుసరిస్తున్నారు. మహిళ సాధికారతకు 33శాతం రిజర్వేషన్ కల్పించారు. మహిళలను ప్రోత్సహించేందుకు కండక్టర్లు, కానిస్టేబుళ్లుగా రిక్రూట్ చేస్తున్నామన్నారు. సదస్సును ప్రారంభించాల్సిందిగా ప్రధానిని కోరినట్లు పేర్కొన్నారు.

సదస్సుకు విచ్చేయనున్న ప్రముఖ వక్తలు..
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ప్రముఖ వ్యక్తలుగా విచ్చేయనున్నవారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నేపాల్ ప్రధాని బింద్యాదేవీ బండారీ, మయన్మార్ నాయకురాలు ఆంగ్‌సన్ సుకీ, అమెరికన్ మహిళా పారిశ్రామికవేత్తలు మిలిండా గేట్స్, ఇంద్రానూయి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా, లైబీరియా అధ్యక్షురాలు ఎలన్ జాన్సన్ సర్‌లిఫ్, దలైలామా, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రోహిణీ, ప్రముఖ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, పీసీ సింధు తదితరులు హాజరుకానున్నారు.

1388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles