నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను బహిష్కరించిన 68 మంది

Thu,May 3, 2018 05:53 PM

National Film Awards Event Amid Row Over President Not Giving All Awards

న్యూఢిల్లీ: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను బహిష్కరిస్తున్నట్లు అవార్డు గ్రహీతలు పలువురు వెల్లడించారు. 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదాన కార్యక్రమం ఈ సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 140 మంది అవార్డులకు ఎంపికయ్యారు. కాగా వీరిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా కేవలం 11 మందికి మాత్రమే అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. మిగతావారికి కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తూ 68 మంది అవార్డు గ్రహీతలు వేడుకను బహిష్కరించారు. ఇది తమను అవమానించడమేనని పేర్కొన్నారు.

రాష్ట్రపతి కేవలం 11 అవార్డులే అందజేస్తారని తమకు చివరి నిమిషంలో చెప్పడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు. ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించే ఓ ప్రతిష్టాత్మక సంస్థ ముందుగానే ఇంత కీలక విషయాన్ని మాకు చెప్పకపోవడం ఓ నమ్మక ద్రోహంగా భావిస్తున్నాం. 65 ఏళ్ల సాంప్రదాయానికి తెరదించడం నిజంగా దురదృష్టకరమన్నారు. దీనిపై ఇప్పటికే స్మృతి ఇరానీతో మాట్లాడినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సెర్మనీకి రాకుండా ఉండటం తప్ప మాకు మరో దారి లేదు. అవార్డుల సెర్మనీని బాయ్‌కాట్ చేసే ఉద్దేశం లేదు కానీ దానికి రాకుండా మా నిరసనను తెలుపుతున్నాం. ప్రముఖ సింగర్ కెజే యేసుదాసు, బెంగాళి ఫిల్మ్ మేకర్ కౌషిక్ గంగూలీ, నటుడు ఫహద్ ఫాసిల్ సంతకాలతో కూడిన ఓ లేఖను విడుదల చేశారు.గుర్తింపు అనేది అంతా ఈజీగా దొరకని రంగంలో కలల సాకారానికి తామంతా కష్టపడి పనిచేస్తాం. జాతీయస్థాయిలో గుర్తింపు, గౌరవం.. జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి వస్తది. అటువంటిది జాతీయ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాలనుకుంటాం. లేకుంటే అది కూడా అన్ని ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఇది కూడా ఒకటని 'న్యూటన్' మూవీ ప్రొడ్యూసర్ మనీశ్ ముద్రా అన్నారు. బాహుబలి ప్రొడ్యూసర్ స్పందిస్తూ.. ఏదైనా అవార్డే అనుకుంటే అటువంటప్పుడు అవార్డును పోస్ట్‌లో పంపాల్సిందన్నారు. ఫిల్మ్‌మేకర్ మేఘనాథ్ స్పందిస్తూ.. రాష్ట్రపతి తమకు అవార్డు అందజేయాలి. ఇది మా హక్కు. ఇదే సాంప్రదాయం. సినిమా తీస్తానికి సంవత్సరాలు పడుతది. కానీ అవార్డు ఇచ్చేందుకు రాష్ట్రపతికి ఒక్క నిమిషం మాత్రమే పడుతదన్నారు.

ఈ విషయంపై రాష్ట్రపతి కార్యాలయం స్పందిస్తూ.. రాష్ట్రపతి కోవింద్ అన్ని అవార్డు ప్రధాన కార్యక్రమాలల్లో గంటకు మించి ఉండరని మనందరికి తెలిసిన విషయమే. రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారు. ఈ విషయాన్ని కొన్ని వారాల క్రితమే సమాచార మంత్రిత్వశాఖకు తెలిపినట్లు.. ఈ విషయం గురించి సమాచార మంత్రిత్వశాఖకు అంతా తెలుసని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అశోక్ మాలిక్ తెలిపారు.

2272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles