రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు

Thu,January 10, 2019 11:48 AM

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. రాఫేల్ వివాదంపై చర్చలో ప్రధాని మోదీ చర్చ నుంచి పారిపోయి మహిళ(కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్) వెనుక దాక్కున్నారన్న రాహుల్ వ్యాఖ్యలపై నోటీసులు జారీఅయ్యాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాలను జాతీయ మహిళ కమిషన్ సుమోటోగా స్వీకరించి రాహుల్ గాంధీకి వివరణ నిమిత్తం నోటీసులు జారీచేసింది. మహిళ గౌరవ మర్యాదలను అగౌరపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నట్లు పేర్కొంది.1476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles