శ్రీదేవి తరపున అవార్డు అందుకున్న బోనీకపూర్

Thu,May 3, 2018 07:00 PM

National Best Actress Award to Late Smt Sridevi

న్యూఢిల్లీ: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. అవార్డు గ్రహీతలు పలువురికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను అందజేశారు. 'మామ్' చిత్రంలో నటనకుగాను దివంగత నటి శ్రీదేవీ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఇవాళ ఆమె భర్త బోనీకపూర్, కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్‌లు రాష్ట్రపతి చేతుల మీదుగా సంయుక్తంగా అందుకున్నారు. అదేవిధంగా సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా దివంగత నటుడు వినోద్ ఖన్నాకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా కెజే యేసుదాసు, బెస్ట్ సపోర్టింగ్ నటి దివ్యాదత్తా, నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో బెస్ట్ డైరెక్షన్ అవార్డు పొందిన నాగరాజ్ మంజులే తదితరులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.2414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles