కొండచిలువ నుంచి తప్పించుకున్న అధికారి.. వీడియో

Mon,June 18, 2018 01:59 PM

Narrow escape for Sanjoy Dutta, Range Officer after a python he rescued

కోల్‌కతా : కొండచిలువ బారి నుంచి ఓ అటవీశాఖ అధికారి తృటిలో తప్పించుకున్నాడు. గ్రామంలోకి ప్రవేశించిన కొండచిలువను పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ పైథాన్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా.. అది ఆయన మెడను ఒక్కసారిగా చుట్టేసింది. అక్కడున్న వారు అప్రమత్తమై కొండచిలువను లాగేశారు. దీంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.

కోల్‌కతాకు 610 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్పాయిగురి గ్రామంలోకి ప్రవేశించిన కొండచిలువ మేకను తినేసింది. అప్రమత్తమైన గ్రామస్తులు అటవీశాఖ అధికారి సంజయ్‌ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సంజయ్.. 18 అడుగుల పొడవు, 40 కేజీల బరువున్న కొండచిలువను స్థానికుల సహాయంతో తన మెడలో వేసుకున్నారు. ఇలా వేసుకున్న కాసేపటికి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా అధికారి మెడను ఫైథాన్ చుట్టేసింది. దీంతో స్థానికులు కొండచిలువను లాగేశారు. ఆ తర్వాత పైథాన్‌ను తీసుకెళ్లి సమీప అడవిలో వదిలేశారు.


4658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles