అయితే మోదీ కూడా ఓటు హ‌క్కు కోల్పోతారు !

Mon,May 27, 2019 04:58 PM

Narendra Modi will loose his right to vote, tweets Asaduddin Owaisi

హైద‌రాబాద్‌: మూడ‌వ బిడ్డ‌ను కంటే వారికి ఓటు వేసే హ‌క్కును క‌ల్పించ‌కూడ‌ద‌ని బాబా రాందేవ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై మ‌జ్లిస్ నేత, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఓ సెటైర్ వేశారు. ప్ర‌ధాని మోదీ కూడా ఓటు వేయ‌కూడ‌దంటూ ఆయ‌న ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ కూడా మూడ‌వ సంతాన‌మే అని, ఆయ‌న కూడా ఓటు హ‌క్కును కోల్పోతార‌ని అస‌ద్ ట్వీట్ చేశారు. రాజ్యాంగ వ్య‌తిరేక కామెంట్లు చేసే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని అస‌ద్ అన్నారు. బాబా రాందేవ్ ఐడియాల‌కు ఎందుకు అంత ఆద‌ర‌ణ క‌ల్పిస్తున్నార‌ని అస‌ద్ ప్ర‌శ్నించారు. దామోద‌ర్‌దాస్ మోదీ, హీరాబెన్ మోదీల మూడ‌వ బిడ్డ‌గా న‌రేంద్ర మోదీ జ‌న్మించారు. 1950, సెప్టెంబ‌ర్ 17న గుజ‌రాత్‌లోని వాద్‌న‌గ‌ర్‌లో ప్ర‌ధాని మోదీ పుట్టారు.4712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles