రూపాయి ఇస్తే.. 15 పైసలే సగటు మనిషికి చేరేది!

Tue,January 22, 2019 03:16 PM

Narendra Modi citing Rajeev Gandhi to take a dig at Congress in Pravasi Bharatiya Divas

వారణాసి: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ చెప్పిన అవినీతి మోడల్‌నే ఉదహరిస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో రూపాయి బయలుదేరితే.. అట్టడుగుకు చేరేసరికి 15 పైసలు మాత్రమే మిగులుతున్నదని ఒకప్పుడు రాజీవ్‌గాంధీ చెప్పిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. మిగతా 85 పైసలు మాయమైపోతున్నాయని ఆయన చెప్పారు. నేరుగా రాజీవ్‌గాంధీ పేరు ప్రస్తావించకుండానే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ లీకేజ్‌ను ఆపడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఒకరు అవినీతి గురించి చెప్పడం మీరు వినే ఉంటారు. ఢిల్లీ నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే సగటు మనిషికి చేరుతున్నది. మిగతా 85 పైసలు మాయమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా దేశాన్ని పాలించిన పార్టీ దీనిని పట్టించుకోలేదు అని మోదీ అన్నారు.

వారణాసిలో జరిగిన ప్రవాసి భారతీయ దివస్ ఈవెంట్‌లో ఎన్నారైలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాలో జరిగిన ఈ 85 శాతం దోపిడీని టెక్నాలజీ సాయంతో తమ హయాంలో పూర్తిగా ఆపేశామని మోదీ స్పష్టం చేశారు. మేము ప్రజలకు రూ.5 లక్షల 80 వేల కోట్లు ఇచ్చాం. వివిధ పథకాల కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లలోకే నేరుగా పంపించాం. పాత పద్ధతి ప్రకారమే మేము కూడా వ్యవహరించి ఉంటే సుమారు రూ.4.5 లక్షల కోట్లు మాయమైపోయేవి అని మోదీ అన్నారు. ఎన్నారైలు భారత బ్రాండ్ అంబాసిడర్లు అని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు.

3089
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles