అత్యాచారం కేసులో దోషిగా తేలిన నారాయణ్ సాయి

Fri,April 26, 2019 04:21 PM

Narayan Sai son of Asaram Bapu, convicted for rape

గుజరాత్: దైవాంశ సంభూతిడిగా చెప్పుకునే ఆశారాం బాపు కొడుకు నారాయణ్ సాయి ఓ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. మహిళపై అత్యాచారం కేసులో సూరత్ కోర్టు నేడు తీర్పును వెలువరిస్తూ నారాయణ సాయిని దోషిగా ప్రకటించింది. ఈ నెల 30న శిక్షను ఖరారు చేయనుంది. కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెళ్లు 2013లో పోలీసులను ఆశ్రయించారు. ఆశారాం బాపు, అతడి కొడుకు నారాయణ్ సాయి ఇరువురు తమపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆశ్రమంలో నివసించే సమయంలో 2002 నుంచి 2005 మధ్య కాలంలో తనపై నారాయణ్ సాయి పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంటూ అక్కాచెళ్లెళ్లలో ఒకరు తెలిపారు. ఈ కేసులో పోలీసులు తీవ్ర గాలింపు అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆశారాం బాపు సైతం ఓ అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదుని అనుభవిస్తున్నాడు.

1610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles