లైంగిక దాడి కేసులో ఆశారాం‍ కుమారుడికి జీవితఖైదు

Tue,April 30, 2019 05:55 PM

Narayan Sai  has been sentenced to life imprisonment.

అహ్మ‌దాబాద్: లైంగిక దాడి కేసులో ఆశారాం బాపూ కుమారుడు నారాయణ్‌ సాయిని సూరత్‌ సెషన్స్‌ కోర్టు గ‌త శుక్ర‌వారం దోషిగా నిర్ధారించిన విష‌యం తెలిసిందే. సూరత్‌లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై నారాయణ్‌ లైంగిక దాడికి పాల్పడినట్టు సెషన్స్‌ కోర్టు ధ్రువీకరించింది. ఈ కేసులో నారాయ‌ణ్ సాయికి జీవిత‌ఖైదు విధిస్తూ మంగ‌ళ‌వారం కోర్టు తుది తీర్పు వెలువ‌రించింది. సాయికి రూ.ల‌క్ష జ‌రిమానా కూడా వేసింది. ఢిల్లీలో 2013 డిసెంబ‌ర్‌లో అరెస్టైన సాయి అప్ప‌టి నుంచి జైల్లోనే ఉన్నారు.


అత్యాచారం కేసులో గంగా, జమున, హనుమాన్‌లను కూడా కోర్టు దోషులుగా పేర్కొనగా, మోనికా అనే మహిళను నిర్ధోషిగా నిర్ధారించింది. అలాగే సాయి డ్రైవ‌ర్ ర‌మేశ్ మ‌ల్హోత్రాను కూడా కోర్టు దోషితా తేల్చింది. మొత్తం న‌లుగురు దోషుల‌కు 10ఏండ్ల పాటు జైలుశిక్ష విధించిన కోర్టు ప్ర‌తి ఒక్క‌రికి రూ.5వేల చొప్పున జరిమానా వేసింది. ఆశ్ర‌మంలో ప‌నిచేసిన ఓ భ‌క్తురాలు ఫిర్యాదు మేర‌కు 2013లో నమోదైన ఈ కేసులో ఆరేండ్ల తర్వాత నారాయణ్ పై అభియోగాలు రుజువు అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి దోషులకు ఇవాళ శిక్ష ఖ‌రారు చేశారు. ఆశారాం బాపూ సైతం మహిళలపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

1167
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles