ఐఐసీ బెంగళూరులో ప్రారంభమైన మృత్యుంజయ కార్టూన్ ప్రదర్శన

Sat,September 8, 2018 05:06 PM

Namasthe Telangana Cartoonist mriryunjay cartoon exhibition started in IIC Bangalore

బెంగళూరు: తెలంగాణ తెలుగు దిన పత్రిక నమస్తే తెలంగాణ చీఫ్ కార్టూనిస్ట్ మృత్యుంజయ కార్టూన్ ప్రదర్శన ప్రారంభమయింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్ కార్యాలయంలో ఉన్న ఇండియన్ కార్టూన్ గ్యాలరీలో ఈ ప్రదర్శన ప్రారంభమయింది. కార్టూన్ ప్రదర్శనను ఈకామర్స్ దిగ్గజం మింత్రా సహ వ్యవస్థాపకుడు రవీన్ శాస్త్రి ప్రారంభించాడు. ఈసందర్భంగా మాట్లాడిన రవీన్.. ఒక కార్టూనిస్ట్ మాత్రమే ఎంతో సమర్థంగా ఓ కార్టూన్‌కు హాస్యాన్ని జతచేసి రీడర్లను ఆకర్షించి చెప్పాల్సిన విషయాన్ని చెప్పగలడని అన్నాడు.

అనంతరం మాట్లాడిన కార్టూనిస్ట్ మృత్యుంజయ.. చేనేత వస్త్ర నిపుణుడైన తన తండ్రి చిలువేరు రామలింగం నుంచే ఈ కళను నేర్చుకున్నట్లు వెల్లడించాడు. మగ్గంపై తండ్రి వేసే అద్భుతాల నుంచి ప్రేరణ పొందానని.. ఈ స్ఫూర్తితోనే తనలో కార్టూన్ కళకు ప్రాణం పోశానన్నాడు.

నంది ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ మంజునాథ్.. కార్టూనిస్ట్ మృత్యుంజయకు బొకే అందించి సత్కరించారు. ఇవాళ ప్రారంభమయిన ఈ ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 22 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఐఐసీ నిర్వాహకులు తెలిపారు. ఆదివారం, ఇతర సెలవు దినాల్లో మాత్రం ఈ ఎగ్జిబిషన్ మూసివేస్తారని తెలిపారు.

కార్టూనిస్టు మృత్యుంజ‌య అనేక క‌ళ‌ల్లో నిష్ణాతుడు. డిజిట‌ల్ పేయింటింగ్‌, స్కెచింగ్‌లోనూ ఆయ‌న‌కు విశిష్ట గుర్తింపు ఉన్న‌ది. రాజ‌నీతి శాస్త్రంలో మృత్యుంజ‌య‌ పీజీ చేశాడు. కేర‌ళ‌, బెంగుళూరులో వ‌ర్క్‌షాపుల్లో ఆయ‌న పాల్గొన్నారు. చైనా, బ్రెజిల్‌, రొమేనియా, ట‌ర్కీ, ఇట‌లీ లాంటి దేశాల్లో మృత్యుంజ‌య కార్టూన్లు ఎగ్జిబిష‌న్‌లో పెట్టారు. కార్టూన్ రంగంలో అత్యుత్త‌మ అవార్డులు ఎన్నో అందుకున్నారు. గ్రీస్ దేశం ఎక్స‌లెన్స్ అవార్డుతో సత్క‌రించింది. చైనా నుంచి బెస్ట్ కార్డూనిస్టు అవార్డు స్వీక‌రించారు. నేష‌న‌ల్ ఎయిడ్స్ కార్టూనిస్టు పోటీలో మొదటి స్థానంలో నిలిచారు. పొలిటిక‌ల్ కార్టూన్ కాంటెస్ట్‌లో మ‌యాకామ‌త్ మెమోరియ‌ల్ అవార్డును అందుకున్నారు.

940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles