నాగేశ్వర్‌రావు ఇక మీరు వెళ్లొచ్చు: సుప్రీం

Tue,February 12, 2019 04:50 PM

Nageshwar Rao has been allowed by the Supreme Court to leave the courtroom

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు గది నుంచి ఇక మీరు ఇంటికి వెళ్లొచ్చని సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వర్‌రావుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన నాగేశ్వర్‌రావుకు సుప్రీం కోర్టు అసాధారణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారిని బదిలీ చేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రూ.లక్ష జరిమానా విధించ‌డమే గాక‌.. ఈ రోజు కోర్టు స‌మ‌యం ముగిసే వరకు కోర్టు గ‌దిలో ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది.

3553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles