షెడ్యూల్ ప్రకారమే నాగాలాండ్ ఎన్నికలు

Tue,November 28, 2017 10:41 PM

Nagaland elections are scheduled in time says EC

కోహిమా: నాగాలాండ్ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పరిస్థితులు, ఎన్నికల సన్నాహాలపై రెండు రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు సమీక్షించారు. ఈ నేపథ్యంలో సహచర కమిషనర్లు ఓపీ రావత్, సునీల్ అరోరా, డైరెక్టర్ జనరల్ దిలీప్‌శర్మలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఏకే జోతి మంగళవారం మీడియాతో మాట్లాడారు. నాగాలాండ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. ఈ లోగా ఎన్నికలు జరుగుతాయి అని చెప్పారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎన్నికల తేదీలు ప్రకటిస్తామన్నారు.

1027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles