బల పరీక్షలో నెగ్గిన నాగాలాండ్ సీఎం

Fri,July 21, 2017 04:05 PM

Nagaland CM TR Zeliang wins trust vote in the state assembly

కోహిమా : నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ బల పరీక్షలో నెగ్గారు. 59 మంది ఎమ్మెల్యేలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జెలియాంగ్‌కు 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు, నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి (డీఏఎన్) చైర్మన్ టీఆర్ జెలియాంగ్ నాగాలాండ్ 19వ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే. కోహిమాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ పీబీ ఆచార్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ నెల 22(శనివారం) లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ జెలియాంగ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారమే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని, ఆ తర్వాతే మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని జెలియాంగ్ మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న షిర్జోలీ లీయెజిత్సు గౌహతి హైకోర్టు ఆదేశించిన ప్రకారం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో విఫలమైన విషయం తెలిసిందే.

1113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles