బలాన్ని నిరూపించుకోలేకపోయిన నాగాలాండ్ సీఎం

Wed,July 19, 2017 12:09 PM

Nagaland CM Shurhozelie Liezietsu fails to turn up for floor test

కోహిమా : నాగాలాండ్ సీఎం సుర్హోజెలీ లియోజిత్సు ఆ రాష్ట్ర అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు. బలపరీక్ష కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలకు సీఎం లియోజిత్సు, ఆయన మద్దతుదారులు రాలేకపోయారు. అసెంబ్లీని బుధవారం ఉదయం 9.30 గంటలకు స్పీకర్ ఇమ్తివాపాంగ్ సమావేశ పరిచారు. సీఎం లియోజిత్సుతో పాటు ఆయన మద్దతుదారులు సభకు రాకపోవడంతో సభను నిరవధిక వాయిదా వేశారు స్పీకర్.

అసలేం జరిగింది
అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్)లో మాజీ సీఎం టీఆర్ జెలియాంగ్ సారథ్యంలో 43 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 15 లోగా విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సీఎం లియోజిత్సును గవర్నర్ ఆచార్య ఆదేశించారు. దీనిపై లియోజిత్సు హైకోర్టును ఆశ్రయించారు. సీఎం లియోజిత్సుకు గువాహటి హైకోర్టులో గట్టిఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అసెంబ్లీ విశ్వాసం పొందాలని గవర్నర్ పీబీ ఆచార్య జారీచేసిన ఆదేశాలను నిలిపివేయాలన్న లియోజిత్సు పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. సీఎం పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎల్ ఎస్ జమీర్ సారథ్యంలోని కోహిమా బెంచ్.. గవర్నర్ నిర్ణయం సరైనదేనని పేర్కొన్నది. గువాహటి హైకోర్టు గవర్నర్ ఆదేశాలకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. దీంతో అసెంబ్లీని అత్యవసరంగా బుధవారం ఉదయం 9.30 గంటలకు సమావేశ పరుచాలని స్పీకర్ ఇమ్తివాపాంగ్‌ను గవర్నర్ పీబీ ఆచార్య ఆదేశాలు జారీ చేశారు.

2138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles