ముస్లిం పెండ్లి పత్రికపై సీతారాముల ఫొటో

Thu,April 25, 2019 05:08 PM

Muslim family puts ramsita photo on wedding card


షాజహాన్‌పూర్ : యూపీలో ఓ ముస్లిం కుటుంబం మత సామరస్యాన్ని చాటింది. చిలౌవా గ్రామంలో రుఖ్సార్ అనే అమ్మాయి తన పెండ్లి పత్రికపై సీతారాముల ఫొటోను ముద్రించి..హిందూముస్లింలంతా ఒకటేనని చాటి చెప్పింది. మతం పేరుతో మమ్మల్ని మేము వేరు చేసుకోం. హిందూముస్లింలతా కులమతాలకు అతీతంగా కలిసి ఉంటున్నాం మతసామరస్యాన్ని దేశానికి తెలియజేయాలనేది మా కోరిక. మా గ్రామంలో అందరం కలిసే ఉంటామని పెళ్లి కూతురు రుఖ్సార్ తల్లి బేబి తెలిపారు. గ్రామస్థులంతా మా సోదరి వివాహ ఆహ్వాన పత్రికను స్వీకరించారు. ప్రజలంతా మా నిర్ణయానికి మద్దతు తెలపడం సంతోషంగా ఉందని రుఖ్సార్ సోదరుడు మహ్మద్ ఉమర్ అన్నాడు.

2792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles