డాక్టర్లు సర్జరీ చేస్తుంటే గిటార్ వాయించాడు.. వీడియో

Thu,June 14, 2018 06:37 PM

Musician played guitar as Bengaluru surgeons did operation on his brain

సాధారణంగా డాక్టర్లు ఏ రోగికైనా ఆపరేషన్ చేసేటప్పుడు రోగి ఏ పనీ చేయకూడదు. పడుకొని ఉండాలి. అటూ ఇటూ కదలకూడదు. మత్తు మందు ఇస్తే అసలు ఆపరేషన్ చేసేది కూడా రోగికి తెలియదు. కాని.. రోజులు మారుతున్నాయి.. టెక్నాలజీ డెవలప్ అవుతున్నది. అందుకే.. కొత్త కొత్తగా రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఆ రోగాలకు తగ్గట్టుగా ట్రీట్‌మెంట్ ఇస్తేనే ఆ జబ్బులు నయమవుతున్నాయి. అందుకే డాక్టర్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. గత సంవత్సరం కూడా ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. మళ్లీ ఇది రెండోది. పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.

బంగ్లాదేశ్‌లోని డాకాకు చెందిన టస్కిన్ అలీ గిటారిస్ట్. అయితే.. టస్కిన్ గత కొన్ని రోజులుగా 'ఫోకల్ హాండ్ డైస్టోనియా' అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అంటే తన ఎడమ చేతి వేళ్లు గిటార్ ప్లే చేయడానికి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. మొబైల్‌లో ఏదైనా టైప్ చేయాలన్నా బాధపడేవాడు. చేతి వేళ్లు మొత్తం చచ్చుబడిపోయాయి. కొత్త రకం వైరస్‌లా కొత్త రకం రోగమని, దీనికి ఎటువంటి చికిత్స లేదని డాక్టర్లు చేతులెత్తేశారు.

జులై 2017లో బెంగళూరులో అభిషేక్ ప్రసాద్ అనే గిటారిస్ట్‌కు కూడా సేమ్ చేతి వేళ్లు పని చేయకపోతే డాక్టర్లు ఆపరేషన్ చేసి సెట్ చేశారు. డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో అభిషేక్ గిటార్ ప్లే చేశాడు. అభిషేక్ గిటార్ ప్లే చేస్తుండగా అతడికి బ్రెయిన్ సర్జరీ చేశారు. దీంతో అభిషేక్‌కు ఉన్న ఆ సమస్య తగ్గింది. ఈ విషయం తెలుసుకున్న టస్కిన్ రీసెంట్‌గా బెంగళూరుకు చేరుకున్నాడు.

మే 17 న బెంగళూరులోని భగ్‌వాన్ మహవీర్ జైన్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం టస్కిన్‌కు బ్రెయిన్ ఆపరేషన్ చేసింది. అలీ మెదడు లోపల 8 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో ఉన్న సర్క్యూట్లను సెట్ చేయడంతో అతడి సమస్యకు బ్రేక్ పడింది. అభిషేక్‌కు చేసిన విధంగానే అలీకి కూడా డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేశారు. డాక్టర్లు సర్జరీ చేస్తుండగానే అలీ గిటార్ ప్లే చేశాడు. అలీ గిటార్ ప్లే చేస్తుండగానే డాక్టర్లు అతడి మెదడులోని సర్క్యూట్లను సెట్ చేశారు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడు. ఇదివరకు లాగానే గిటార్ ప్లే చేస్తున్నాడు.


మ్యుజీషియన్స్‌కు వచ్చే డైస్టోనియా అనేది ఓ డిజార్డర్ అని, ఇండియాకు చెందిన మ్యుజీషియన్లలో 1 శాతం మంది మాత్రమే ఈ డిజార్డర్ బారిన పడతారని డాక్టర్లు తెలిపారు. ఈ సమస్యను రూపుమాపడానికి సర్జరీయే బెస్ట్ ఆప్షన్ అని వాళ్లు తెలిపారు.

3290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles