బాలీవుడ్ సంగీత దర్శకుడు ఆదేశ్ మృతి

Sat,September 5, 2015 08:20 AM

Music Composer Aadesh Shrivastava Dies of Cancer

ముంబయి: బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు ఆదేశ్ శ్రీవాత్సవ(51) నేటి తెల్లవారుజామున మృతిచెందాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అందేరిలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 2011లో మొదటిసారిగా ఆదేశ్ క్యాన్సర్ భారిన పడ్డారు. గడిచిన 40 రోజులుగా వ్యాధితో తీవ్రంగా పోరాడాడు. బాలీవుడ్ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

మాజీ నటి, భార్య విజేత పండిట్ వ్యాధిపై పోరాటంలో చివరివరకు అండగా నిలిచారు. వీరికి అనివేశ్, అవితేశ్ అను ఇద్దరు కొడుకులు ఉన్నారు. చికిత్సకు స్పందించని కారణంగా కిమోథెరపిని వైద్యులు గత కొన్ని రోజులక్రితం నిలిపివేశారు. ఛల్తే ఛల్తే, బాగ్‌బన్, కబీ ఖుషీ కబీ గమ్ వంటి తదితర సూపర్‌హిట్ సినిమాలకు ఆదేశ్ సంగీత దర్శకుడిగాపనిచేశారు. ఆదేశ్ చివరి ప్రాజెక్టు వెలకమ్ బ్యాక్ మూవీ.

1816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles