ఈసారి జాన్వీ కపూర్ వంతు.. ముంబై పోలీసుల వినూత్న ప్రయోగం

Fri,June 22, 2018 04:58 PM

Mumbai police uses Janhvi Kapoor's Dhadak dialogue to promote road safety

సోషల్ మీడియా జనాల్లోకి విస్తృతంగా వెళ్లాక ఇప్పుడు చాలా మంది అధికారులు సోషల్ మీడియానే అస్త్రంగా ఎంచుకుంటున్నారు. ప్రజలకు ఏదైనా చెప్పాలన్నా.. వారికి అవేర్‌నెస్ కలిగించాలన్నా.. వాళ్ల సమస్యలు తెలుసుకోవడానికి కూడా దీన్నే ప్లాట్‌ఫాంగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి వాటిలో ముంబై పోలీసులు చాలా ముందుంటారు. జనాల నాడిని పసిగట్టిన వాళ్లు.. సినిమా డైలాగులను, సినిమా పేర్లు, నటులు, వాళ్ల పాత్రలు ఇలా సినిమా నేపథ్యంతో జనాలకు అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ రూల్స్ గురించి సినిమా నేపథ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

రీసెంట్‌గా వచ్చిన ధడక్ ట్రైలర్‌లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చెప్పిన ఓ డైలాగ్‌ను బేస్ చేసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ మీద ముంబైకర్స్‌కు అవగాహన కల్పించారు పోలీసులు. ట్రైలర్‌లో సినిమా హీరో ఇషాన్‌తో "నాటకాలు చేస్తున్నావా.. నన్ను ఎందుకు చూడట్లేవు.." అంటూ చెప్పిన డైలాగ్‌ను తమదైన శైలిలో ట్రాఫిక్ సిగ్నల్‌కు అనునయించారు పోలీసులు. "ట్రాఫిక్ సిగ్నల్స్‌కు కూడా ఎమోషన్స్ ఉంటాయి. కాని.. మీరు చేసే తప్పు వల్ల అవి వేసే ఈ చాలన్స్ అంటే మాత్రం వాటికి అస్సలు నచ్చదు. అవి మీ మధ్య బంధాన్ని తెంపేస్తుంది.." అంటూ ట్వీట్ చేశారు.

ఇక.. ట్రాఫిక్ పోలీసుల ఈ విన్నూత ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమదైన శైలిలో ఆ ట్వీట్‌కు కామెంట్లు చేస్తున్నారు. ఇదివరకు రేస్3 సినిమాలోని దేశీ షా డైలాగ్ "అవర్ బిజినెస్ ఈజ్ అవర్ బిజినెస్.. నన్ ఆఫ్ యువర్ బిజినెస్" డైలాగ్‌ను కూడా సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన కల్పించడానికి ముంబై పోలీసులు వాడుకున్నారు. అంతకుముందు వ్లోగర్ "చాయ్ పీలో ఆంటీ" డైలాగ్ "చాయ్ పీలో ఫ్రెండ్స్‌"ను కూడా సేఫ్టీ కోసం "సేఫ్..టీ" అంటూ వినూత్నంగా ప్రచారం చేసి ముంబైకర్స్ మన్ననలు పొందారు.


జాన్వీ కపూర్ ధడక్ ట్రైలర్ ఇదే..


3040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles