వైరలయిన ముంబై పోలీసులు సృష్టించిన రేస్3 మెమె!

Wed,May 23, 2018 05:39 PM

Mumbai Police hilarious Race 3 Meme is trending online

మెమెలు తెలుసు కదా. దేనిమీదయినా.. సెటైరికల్‌గా పంచ్ వేయడమే మెమె అంటే. సినిమాలో డైలాగ్, సినిమా పేరు, రాజకీయ నాయకుల మీద , సినిమా నటుల మీద ఇలా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉన్న దేనిమీదైనా మెమెలు క్రియేట్ చేస్తుంటారు. తాజాగా ముంబై పోలీసులు ఓ మెమె చేశారు. రీసెంట్‌గా వచ్చిన రేస్3 ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ను తీసుకొని తమ దైన శైలిలో మెమెను తయారు చేశారు. ఇప్పుడు ఆ మెమెకు నెటిజన్ ఫిదా అవడమే కాదు.. దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటా మెమె అనేగా మీ ప్రశ్న. రేస్ 3 ట్రైలర్‌లో దేశీ షా ఓ డైలాగ్ చెబుతుంది. ఏంటంటే.. అవర్ బిజినెస్ ఈజ్ అవర్ బిజినెస్... నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక.. ఇదే డైలాగ్‌ను ముంబై పోలీసులు ప్రజలకు సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన కల్పించడం కోసం వాడుకున్నారు. ఎవరైనా ఆన్‌లైన్‌లో మీ వ్యక్తిగత వివరాలను అడిగితే ఏం చేస్తారు? అంటూనే మై డేటా ఈజ్ మై డేటా.. నన్ ఆఫ్ యువర్ డేటా.. అని మెమె చేశారు. దాన్ని తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక.. వినూత్నంగా చేసిన ఈ మెమె నెటిజన్ల‌కు తెగ నచ్చడంతో వాళ్లు ముంబై పోలీసులను తెగ మెచ్చుకుంటున్నారు.అయితే.. ముంబై పోలీసులు ఇలా మెమెలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. ఇదివరకు ఇలాగే కొన్ని సినిమాల, టీవీ షోల డైలాగులను ఉపయోగించి ముంబై ప్రజలకు ట్రాఫిక్ పాఠాలు నేర్పించారు. కొన్ని రోజుల క్రితం అవెంజర్స్, బాహుబలి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాల మీద కూడా మెమెలు క్రియేట్ చేశారు.


ఇక.. రేస్3 విషయానికి వస్తే ఈ రంజాన్ కానుకగా జూన్ 15 న సినిమా రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్, దేశీ షా, అనిల్ కపూర్, బాబీ డియోల్, సాహిబ్ సలీమ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఒకవేళ మీరు రేస్3 ట్రైలర్ చూడకపోతే ఇక్కడ చూసేయండి.

2157
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS