ట్రైన్ మీది నుంచి పోయినా బ‌తికి బ‌ట్ట క‌ట్టింది..!!

Mon,June 5, 2017 01:28 PM

Mumbai Girl Run Over by Goods Train, Survives

ముంబ‌యి: రైల్వే ట్రాక్ పై న‌డిచి ఎంతోమంది త‌మ ప్రాణాలు పోగొట్టుకున్నా... ట్రాక్ పై న‌డ‌వ‌డం మాత్రం మానుకోం మ‌నం. ఎన్ని ప్ర‌మాదాలు జ‌రిగినా...ప‌ట్టించుకోకుండా ట్రాక్ ను దాటుతూనే ఉంటాం. ఇలాగే... రైల్వే ట్రాక్ దాటుతూ తృటిలో మృత్యువును త‌ప్పించుకుంది ఓ అమ్మాయి. ముంబ‌యిలోని కుర్లా రైల్వే స్టేష‌న్ లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. బాండూప్ కు చెందిన ప్ర‌తిక్ష న‌టెక‌ర్ కుర్లాలోని త‌న ఫ్రెండ్ ను క‌ల‌వ‌డానికి వ‌చ్చింది. తిరిగి బాండూప్ వెళ్ల‌డానికి కుర్లా స్టేష‌న్ లోని 7 వ నెంబ‌ర్ ప్లాట్ ఫాం కు వెళ్ల‌డానికి ట్రాక్ ను క్రాస్ చేస్తున్న‌ది. అదే స‌మ‌యంలో గూడ్స్ రైలు ఆ ట్రాక్ నుంచి వెళ్తున్న‌ది.


చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని ఉండ‌టంతో ఆ ట్రాక్ పై వ‌చ్చే గూడ్స్ ను చూడ‌లేదు ప్ర‌తిక్ష‌. ఫ్లాట్ ఫాం పై ఉన్న ప్ర‌యాణికులు ప్ర‌తిక్ష ను గ‌మ‌నించి కేక‌లు వేశారు. అంత‌లోనే ట్రైన్ త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చేసింది. గూడ్స్ డ్రైవ‌ర్ స‌డెన్ గా బ్రేక్ వేసినా ట్రైన్ ఆగ‌లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు ప్ర‌తిక్ష‌కు. అంత‌లోనే ట్రైన్ వ‌చ్చి త‌న‌ను తాకింది. దీంతో ట్రాక్ మ‌ధ్య‌లో ప‌డిపోయింది ప్ర‌తిక్ష‌. త‌న మీద నుంచి రెండు మూడు బోగీలు వెళ్లిన త‌ర్వాత ట్రైన్ ఆగిపోయింది. ఇక త‌ను ప‌క్కా చ‌నిపోయుంటుంద‌ని భావించి ట్రైన్ కింద చూశారు ప్ర‌యాణికులు. భ‌యంతో త‌ను అరుస్తున్న మాట‌లు విన్న వాళ్లు వెంట‌నే త‌న‌ను ట్రైన్ కింది నుంచి బ‌య‌ట‌కు లాగారు. ట్రైన్ బ‌లంగా తాక‌డంతో ఎడ‌మ క‌న్నుకు చిన్న‌గాయం అయింది ప్ర‌తిక్ష‌కు అంతే. కాని.. పెద్ద పెద్ద గాయాలు ఏం కాలేదు. వెంట‌నే ద‌గ్గ‌ర్లోని రాజావాడి హాస్ప‌టిల్ కు త‌ర‌లించారు త‌న‌ను. ఇక ఈ ఘ‌ట‌న అంతా రైల్వే స్టేష‌న్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది.

5419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS