కులం పేరుతో వేధింపులు.. వైద్యురాలు ఆత్మహత్య

Sat,May 25, 2019 11:46 AM

Mumbai doctor commits suicide over caste Harassment by seniors

ముంబయి: కులం పేరుతో వేధింపులు తాళలేక ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ముంబయి సెంట్రల్‌లో చోటుచేసుకుంది. మృతురాలు పాయల్‌ సల్మాన్‌ తాడ్వి(26). బీవైఎస్‌ నాయర్‌ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. గైనకాలజి విభాగంలో పోస్టు గ్రాడ్యూయేషన్‌ చేస్తుంది. కాగా బాధితురాలిని తన ముగ్గురు సీనియర్లు తరచుగా కులం పేరుతో వేధింపులకు గురిచేసేవారు. ఈ వేధింపులు తాళలేక తాడ్వి హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. వేధింపులపై ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు సీనియర్‌ వైద్యులు హేమా ఆహుజా, భక్తి మహిరా, అంకిత కండేవాల్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles