ముకేశ్‌ అంబానీ ఇంట మరో పెళ్లి..

Tue,February 12, 2019 12:03 PM

Mukesh Ambani wife Neeta visit Siddhivinayak temple offer wedding card

ముంబై : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట మరో పెళ్లి వేడుక త్వరలోనే జరగనుంది. ముకేశ్‌ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ వివాహం ఈ ఏడాది మార్చి 9న జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ నిన్న సాయంత్రం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక టెంపుల్‌కు వచ్చారు. పెళ్లి ఆహ్వాన పత్రికను వినాయకుడి పాదాల వద్ద ఉంచి అంబానీ కుటుంబం ప్రత్యేక పూజలు చేసింది.

గతేడాది మార్చిలో ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతా నిశ్చితార్థం గోవాలోని ఓ ఫైవ్‌స్టార్‌ రిసార్ట్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్పెల్‌ మెహతా కుమార్తె శ్లోకా మెహతా, ఆకాశ్‌ అంబాన్నీ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఆకాశ్‌ రిలయన్స్‌ రిటైల్‌, జియోలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. శ్లోకా లండన్‌లోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. ప్రస్తుతం తమ డైమండ్‌ కంపెనీలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్లోకా. గతేడాది డిసెంబర్‌లో ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈషా అంబానీ వివాహం పిరమల్‌ గ్రూప్‌ అధినేత అజయ్‌ పిరమల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమల్‌తో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

3201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles