కుమారుడి పెళ్లికి స్టాలిన్‌ను ఆహ్వానించిన ముకేశ్ అంబానీ

Tue,February 12, 2019 04:18 PM

Mukesh Ambani and wife Nita invite MK Stalin and Durga Stalin to son Akash's wedding

చెన్నై: ఇటీవల కుమార్తె ఇషా అంబానీ వివాహాన్ని గ్రాండ్‌గా నిర్వహించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ వివాహం వచ్చే మార్చి 9న ప్రముఖ వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో జరగనుంది. ఈ నేపథ్యంలోనే ముకేశ్ దంపతులు అతిథుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. చెన్నైకి వెళ్లిన అంబానీ దంపతులు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్లి తమ కుమారుడి వివాహ మహోత్సవానికి తప్పకుండా హాజరుకావాలని ఆహ్వానించారు. స్టాలిన్‌కు వివాహ శుభలేఖను అందజేసిన అనంతరం కుటుంబ సభ్యులతో ముకేశ్‌, నీతా గ్రూప్ ఫొటో దిగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తమ నివాసానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని స్టాలిన్ పేర్కొంటూ.. ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్నారు.1936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles