మోదీకి పుల్వామా కంటే పబ్లిసిటీ షూటింగ్ ముఖ్యమా? కాంగ్రెస్ ఫైర్

Thu,February 21, 2019 05:03 PM

Mr PM Is publicity more important than pulwama news

పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు హతమైన ఘటనపై ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ యుద్ధవిరామానికి తెరదించింది. ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు సంధించింది. దాడి జరిగిన సమయంలో ప్రధాని నోదీ కార్బెట్ నేషనల్ పార్కులో ప్రచారచిత్రం షూటింగ్‌లో ఉన్నారని, ఘోరమైన దాడి జరిగిందని తెలిసినా కూడా ఆయన తాపీగా షూటింగ్ ముగించుకుని ఢిల్లీకి తిరిగివచ్చారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అధికారదాహంతో రాజధర్మాన్ని విస్మరించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తలను ప్రస్తావించారు. 3.10కి దాడి జరిగితే కాంగ్రెస్ 5.15కు స్పందించిందని సూర్జేవాలా తెలిపారు. కానీ కుహనా జాతీయవాది అయిన ప్రధాని మాత్రం చానల్ సిబ్బందితో తన నౌకావిహారాలు కొనసాగించారని అన్నారు. దేశంలో ఎవరికీ అన్నం రుచించని సమయంలో ప్రధాని మాత్రం పీడబ్ల్యూడీ గెస్ట్‌హౌస్‌లో ప్రబుత్వ ఖర్చుతో సాయంత్రం 7.00 గంటలకు చాయ్, సమోసాలను ఎంజాయ్ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి విమర్శించారు. అమర జవాన్ల అవశేషాలను సేకరిస్తున్న తరుణంలో ప్రధాని ప్రచార కార్యమ్రంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఓ దేశ ప్రధాని నుంచి ఈ తరహా ప్రవర్తన ఆశించగలమా? అని సూర్జేవాలా ప్రశ్నించారు. తక్షణమే క్యాబినెట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్యలు చేపట్టాల్సి ఉండిందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిఘా వైఫల్యం గురించి, ప్రాధాన్యతల గురించి నిలదీయాల్సి ఉందని అన్నారు. ఓవైపు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తలమునకలుగా ఉండాల్సిన ప్రధాని దక్షిణకొరియా పర్యటన అంటూ వెళ్లిపోయారని విమర్శించారు.

1954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles