రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహానిని కలిసిన ఎంపీ వినోద్

Mon,October 8, 2018 09:06 PM

mp vinod meets Railway board chairmen ashwini lohani

న్యూఢిల్లీ: కరీంనగర్ నుంచి ఢిల్లీకి వయా నిజామాబాద్ మీదుగా కొత్త రైలు నడపాలని కేంద్రాన్ని కోరామని ఎంపీ వినోద్‌కుమార్ వెల్లడించారు. ఎంపీ వినోద్ కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహానిని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ..ఉత్తర తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా ఢిల్లీకి కొత్త రైలు నడపాలని కోరినట్లు చెప్పారు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ఇటీవలే పూర్తయింది. ముద్‌ఖేడ్-ఆదిలాబాద్ మీదుగా నాగపూర్ లైన్ పూర్తయింది. ఈ మార్గంలో కొత్త రైలు నడపాలని విజ్ఞప్తి చేశాం. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ఈ కొత్త రైలు సౌకర్యం కల్పించాలని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తులపై రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారని వినోద్ తెలిపారు.

1718
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles