'ప్రసాద్' పథకంలో రామప్పను చేర్చాలి!

Mon,February 11, 2019 04:44 PM

mp sitaram naik meets  Union minister KJ Alphons

న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ఆల్ఫోన్స్‌ను ఎంపీ సీతారాం నాయక్, తెలంగాణ టూరిజం ఛైర్మన్ భూపతిరెడ్డి, టూరిజం జీఎం సురేందర్ కలిశారు. కేంద్ర పర్యాటకశాఖ తీసుకువచ్చిన ప్రసాద్ పథకంలో పురాతన రామప్ప ఆలయం, రామప్ప చెరువును చేర్చాలని కేంద్ర మంత్రిని ఎంపీ సీతారాం నాయక్ కోరారు. స్వదేశీ దర్శన్ పథకంలో ట్రైబల్ సర్క్యూట్ రామప్పను చేర్చాలని కోరినట్లు ఎంపీ వివరించారు. సందర్శకులతో కళకళలాడుతున్న రామప్ప లేక్‌కు 2 హౌజ్ బోట్‌లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

ట్రైబల్ సర్క్యూట్‌లో ములుగు, లక్నవరం, తాడ్వాయి, మేడారం, దామరవాయి, మల్లూరు, బొగథ వాటల్ ఫాల్స్ మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని ఆలయాలు, హెరిటేజ్ సంపను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీతారం పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles