ఉగ్ర‌వాదుల‌కు త‌గిన స‌మాధానం చెప్పేందుకు మా పూర్తి మ‌ద్ద‌తు

Sat,February 16, 2019 03:03 PM

MP Jithender Reddy  Attend   all party meeting called by central govt

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులు మళ్లీ ఎక్కడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్‌పార్టీ మీటింగ్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డి తెలిపారు. ఉగ్రవాదం నిర్మూలనకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా.. సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్ని పార్టీలు తెలిపాయని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ ఏడీజీ పుల్వామా ఉగ్రదాడి ఘటన వివరాలను అన్ని పార్టీలకు వివరించారని తెలిపారు. ఇలాంటి ఘటనలతో ఉగ్రవాదులు భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నారని ఎంపీ వ్యాఖ్యానించారు.

పుల్వామా ఘటనను ఖండిస్తూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తొలగించాలని ముక్త కంఠంతో స్పష్టం చేశాం. ప్రస్తుత ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఉగ్రవాదుల ఏరివేతకు, జాతి సమైక్యతకు టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఇప్పటి దాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్షం సమావేశంలో వివరించారని ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు.

1583
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles