ఎఫ్‌బీ లైక్‌లు, ట్విట్టర్ ఫాలోవర్లుంటేనే ఎమ్మెల్యే సీటు

Mon,September 3, 2018 02:39 PM

MP congress offers MLA tickets only for who have FB likes and Twitter followers

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయాత్తమవుతోంది. టికెట్లు ఆశించే అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ ఓ టార్గెట్ పెట్టింది. సోషల్ మీడియా హల్ చేస్తున్న ఈ రోజుల్లో.. టికెట్లు కోరుకుంటున్న అభ్యర్థులకు సోషల్ మీడియా అకౌంట్ ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. అంతేకాదు, ఫేస్‌బుక్‌లో సుమారు 15వేల లైక్‌లు, ట్విట్టర్‌లో 5 వేల ఫాలోవర్లు ఉండాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ లేఖను రిలీజ్ చేసింది. బూత్ లెవల్ వర్కర్లకు వ్యాట్సాప్ గ్రూప్ కూడా ఉండాలని ఆ లేఖలో ఆదేశించింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్విట్టర్ అకౌంట్‌లోని ట్వీట్లు.. టికెట్ ఆశించే ఎమ్మెల్యే అభ్యర్థి వాటిని ఎప్పటికప్పుడూ ట్వీట్ చేయాలట.

1052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles