ఓబీసీల్లో ఒక్కో వ్యక్తికి రూ.20 చొప్పున ఇస్తే ఎలా..?

Tue,February 12, 2019 05:46 PM

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ర్టానికి ఎలాంటి కేటాయింపులు జరగలేదని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. లోక్‌సభలో నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 46 వేలకు పైగా చెరువులను అభివృద్ధి చేశామని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలి. విభజన చట్టంలోని స్టీల్ ఫ్యాక్టరీ గురించి బడ్జెట్‌లో పేర్కొనలేదు.


రాష్ట్రంలో అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. 30లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించాలన్నది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా కేంద్ర సర్కార్ ఇవ్వట్లేదు. ఫైనాన్స్ బిల్లులో సగం భారతదేశాన్ని మరచిపోయారు. దేశంలో ఉన్న ఓబీసీలకు సరైన బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. దేశ జనాభాలో 50శాతం ఉన్న ఓబీసీలకు రూ.1200కోట్లు కేటాయించారు. ఓబీసీల్లో ఒక్కో వ్యక్తికి రూ.20 చొప్పున ఇస్తే ఏమాత్రం సరిపోతాయి అని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు.

3310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles