జాతీయ ఛానెళ్లలో ప్రతి రోజు రైతుబంధుపై చర్చ..!

Thu,January 31, 2019 05:44 PM

MP B Vinod Kumar lashes out central government

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ఎంపీ వినోద్ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రసంగంలో చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవన్నారు. దేశంలో పేదవారి బతుకుల్లో మార్పు గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమని ఎంపీ అన్నారు. ఐదేళ్ల పాలనలో మోడీ సర్కారు దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమ‌ర్శించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని వినోద్ పేర్కొన్నారు. ఐదేళ్లలో ఇలాంటి పథకం ఒక్కటైనా మోడీ సర్కారు అమలు చేసిందా అని ఆయన ప్రశ్నించారు.


రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పిన స్వచ్ఛ్ భారత్, ఉజ్వల పథకాలు బీజేపీ ప్రభుత్వం ప్రారంభించినవి కావన్నారు. ఈ పథకాలు మోదీతో మొదలు కాలేదు.. వీరితో ముగింపు కాదు. ఎల్పీజీ సిలెండర్లు సైతం బీజేపీ ప్రభుత్వంతో మొదలు కాలేదు. 1970 నుంచే సిలెండర్లు అందిస్తున్నాం. తెలంగాణ కొత్త రాష్ట్రమైన, ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా ఫ్టాగ్‌షిప్ పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దేశం చెప్పుకునేలా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. జాతీయ ఛానెళ్లలో ప్రతి రోజు రైతుబంధుపై చర్చ జరుగుతోంది. ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై స్పందించాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఐదేళ్ల మోదీ పాలనలో ఆశించిన రీతిలో ఏమీ చేయలేదు. మా పోరాటాలతో ఐదేళ్లలో ప్రాజెక్టులకు అనుమతులు సాధించగలిగామని వివరించారు.

2545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles