ప్రముఖ మోటార్ సైకిల్ కోచ్ చేతనా పండిట్ ఆత్మహత్య

Wed,July 11, 2018 05:31 PM

motorcycle coach Chetna Pandit allegedly commits suicide

ముంబయి: ప్రముఖ మోటార్ సైకిల్ కోచ్ చేతనా పండిట్(27) ఆత్మహత్య చేసుకుంది. ముంబయిలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. సీలింగ్ ఫ్యాన్‌కు తన దుప్పటాతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఎంతో సాధించేతత్వంతో ఉండి.. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైన కారణంగా విపరీత స్థితికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నట్లుగా పోలీసులు తెలిపారు. తన చావుకు వేరెవరూ కారణం కాదని లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించారు. చేతనా పండిట్ తన సోదరుడితో కలిసి ఉంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతడు ఇంట్లో లేడు. అతను తిరిగి వచ్చేసరికి ఆమె చనిపోయి కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు. ప్రమాదపూరిత మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను నడపడంలో చేతనా మహిళలకు శిక్షణ ఇచ్చేది. రాయల్ ఎన్‌ఫీల్డ్ టూరింగ్ కంపెనీలో సభ్యత్వం కలిగిన మొదటి మహిళ చేతనా పండిట్. ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తల్లిని కోల్పోయింది. మేనమామ చేరదీసి సాకాడు. అతడికి గ్యారేజీలో సహాయంగా ఉండేది. పిక్‌అప్, డెలివరీకి వెళ్లడం మొదలుపెట్టింది. కాగా మోటార్ సైకిల్ నడిపేందుకు తొమ్మిది నెలల పాటు శ్రమించి తన అత్తను ఒప్పించింది.

1467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles