చదవడం లేదని కన్నకూతురిని కొట్టి చంపిన తల్లి

Tue,May 21, 2019 11:18 AM

mother beating her daughter in tamilnadu

చెన్నై: తమిళనాడులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చదవకుండా టీవీ చూస్తోందని కన్నకూతురిని తల్లి దారుణంగా కొటింది. సంఘటన వివరాల్లోకి వెళితే తల్లి నిత్య కమల ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. తన ఐదేళ్ల కుమార్తె లతికాశ్రీ ఎంత చెప్పినా వినకుండా టీవీ చూస్తోందని నిత్య కమల చిన్నారిని కొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లతికాశ్రీ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles