పుల్వామా ఎన్ కౌంటర్..ఉగ్రవాది జకీర్ మూసా

Fri,May 24, 2019 09:38 AM

most wanted terrorist Zakir Musa killed in Pulwama encounter


జమ్మూ కశ్మీర్ : పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలోని దాద్సర గ్రామంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో అన్సార్ గాజావత్ అల్ హింద్ కమాండర్ (ఉగ్రవాది) జకీర్ మూసా హతమయ్యాడు. దాద్సర గ్రామంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారమందుకున్న కేంద్ర భద్రతా బలగాలు ఆపరేషన్ ముమ్మరం చేశాయి. భద్రతాదళాలు గాలింపు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. జకీర్ మూసా మృతదేహం వద్ద నుంచి ఏకే -47 రైఫిల్ తోపాటు ఓ రాకెట్ లాంచర్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles