కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం

Wed,August 8, 2018 04:22 PM

Mortal remains of DMK Chief M Karunanidhi being taken to MarinaBeach for last rites

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి ప్రారంభమైంది. చెన్నైలోని వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం మీదుగా అంతిమయాత్ర సాగనుంది. మహాప్రస్థానం వాహనంలో ఆయన భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. కరుణను చూసేందుకు ప్రజలు రహదారుల వెంట భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు మెరీనా బీచ్‌లోని అన్నా స్కేర్ వద్ద కలైంజర్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. తమ ప్రియతమ నాయకుడి కడచూపు కోసం ప్రజలు, డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జీ కూడా చేశారు. మెరీనా బీచ్‌లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS