కాంగ్రెస్‌ను వీడేందుకు 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధం..

Tue,May 28, 2019 12:23 PM

More than 15 MLAs in Gujarat want to quit Congress, claims Alpesh Thakor

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. పార్టీ చీఫ్ రాహుల్ త‌న ప‌ద‌విని వ‌దులుకునేందుకు మ‌క్కువ చూపుతున్న త‌రుణంలో.. గుజ‌రాత్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన సుమారు 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఓబీసీ నేత అల్పేశ్ థాకూర్ తెలిపారు. కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంటే, ఆ పార్టీ మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు కూడా అధికారంలోకి రాదు అని అల్పేశ్ థాకూర్ అన్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని ఉన్న‌ద‌ని, కానీ పార్టీ తీరు ఇలా ఉంటే దాంట్లో కొన‌సాగ‌లేమ‌ని, పార్టీ వ్య‌వ‌హార‌శైలి ప‌ట్ల ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ‌లో ఉన్నార‌ని అల్పేశ్ తెలిపారు. సోమ‌వారం రోజున గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్‌ను అల్పేశ్ థాకూర్ క‌లిశారు. ప‌టాన్ జిల్లాలోని రాధాన్‌పూర్ నుంచి థాకూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన అల్పేశ్‌.. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ఆ పార్టీని వీడారు.

6213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles