వీడియో..మూన్‌వాకింగ్‌తో ట్రాఫిక్ డ్యూటీ

Fri,December 29, 2017 01:00 PM

Moonwalking Traffic Cop vedio in indore Goes Viral

మధ్యప్రదేశ్ : అది ఇండోర్ పట్టణంలో నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే జంక్షన్. ట్రాఫిక్ జంక్షన్‌లో ఓ కానిస్టేబుల్ మూన్‌వాకింగ్ చేస్తుంటాడు. ట్రాఫిక్ పోలీస్ ఏంటీ మూన్‌వాకింగ్ ఏంటీ అనుకుంటున్నారా..?. అవును మీరు విన్నది నిజమే. రంజిత్ సింగ్ అనే ట్రాఫిక్ పోలీస్ తనకెంతో ఇష్టమైన మూన్‌వాకింగ్ చేస్తూ డ్యూటీ చేస్తుంటాడు. అందరి దృష్టిని ఆకర్షిస్తూ రోజూ బిజీగా ఉండే కూడలిలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తుంటాడు రంజిత్ సింగ్.

అయితే ఈ స్పెషల్ మూన్‌వాకింగ్ పోలీసును మీడియా పలుకరించగా..ఎన్నో సంవత్సరాల నుంచి నేను పాప్‌స్టార్ మైకేల్ జాక్సన్ వీరాభిమానిని. మైకేల్ జాక్సన్ చేసిన మూన్‌వాకింగ్ డ్యాన్స్ నాకెంతో ఇష్టం. గత 12 ఏళ్లుగా మూన్‌వాకింగ్ స్టెప్పును వేస్తూ ట్రాఫిక్ విధులను నిర్వర్తిస్తున్నానని చెప్పాడు. ఎంతో బిజీగా ఉండే రోడ్డులో మూన్‌వాకింగ్ చేస్తూ వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులను నియంత్రిస్తూ పనిచేయడమంటే చాలా కష్టమైన పని అని..అయినా నేను ఎంతో ఫ్యాషన్‌తో డ్యూటీని చేస్తున్నానని రంజిత్ సింగ్ చెప్పాడు.

ఇక ప్రజలకు సేవలందించే తన ఉద్యోగాన్ని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేలా ఇష్టంగా చేస్తున్న రంజిత్ సింగ్ సోషల్‌మీడియాలో పాపురల్ అయిపోయాడు. ఫేస్‌బుక్‌లో రంజిత్‌సింగ్‌ను ఫాలో అవుతున్నవారి సంఖ్య 50వేలు పైనే ఉందంటే అతనికున్న ఫాలోయింగ్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. స్రరికొత్త ఆలోచనతో ప్రమాదాలు జరుగకుండా..ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసేందుకు రంజిత్‌సింగ్ అవలంభిస్తున్న విధానాలపై ఇండియన్ యూనివర్సిటీ అధ్యయనం కూడా చేస్తోందట. టాఫిక్ పోలీస్ రంజిత్ సింగ్ మూన్‌వాకింగ్ డ్యూటీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరీ.


2558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles