50 లక్షలు వెదజల్లారు.. ఎందుకో తెలుసా... వీడియో

Sun,May 20, 2018 07:55 AM

Money showered on folk singers at a devotional programme in Gujarat

వంద కాదు.. వెయ్యి అంతకన్నా కాదు.. ఏకంగా రూ. 50 లక్షలను ఓ వ్యక్తిపై వెదజల్లారు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్‌లో చోటు చేసుకున్నది. గత రాత్రి వల్సాద్‌లో ఓ ఆద్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమలో ఓ జానపద కళాకారుడు వాయిద్యాలను వాయిస్తూ పాట పాడాడు. అతడి పాటకు పరవశమైన కొంతమంది 50 లక్షల విలువైన కరెన్సీని అతడిపై వెదజల్లారు. కరెన్సీ వర్షం కురిపించారు. అయినప్పటికీ.. ఆ వ్యక్తి అలాగే పాట పాడటం గమనార్హం. అందులో ఎక్కువగా కొత్తగా వచ్చిన పది రూపాయల నోట్లు, 500 నోట్లు కనిపించాయి. ఓవైపు వాటిని వెదజల్లుతుండగానే మరోవైపు వాటిని సంచుల్లో వేసి లెక్కించారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
5063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS