బీజేపీలోకి మోహన్‌లాల్.. జోరుగా ఊహాగానాలు

Tue,September 4, 2018 03:55 PM

mohanlal joining bjp.. rumour mill abuzz

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కృష్ణాష్టమి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీని కలుసుకోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున కేరళ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానిని కలిసి తాను నిర్వహించే విశ్వశాంతి ఫౌండేషన్ కార్యకలాపాల గురించి వివరించినట్టు మోహన్‌లాల్ ట్విట్టర్‌లో పోస్టుపెట్టారు. నవ కేరళ నిర్మాణంపై నిర్వహించే ప్రపంచ మలయాళీ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని అంగీకారం తెలిపారని, వరదలకు గురైన కేరళకు తగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారని కూడా మోహన్‌లాల్ వెల్లడించారు. ప్రధాని కూడా మోహన్‌లాల్‌తో జరిపిన సమావేశంపై ట్వీట్ చేశారు. మోహన్‌లాల్ నిరాడంబరుడని, ఎన్నెన్నో కార్యకలాపాలు చేపడుతున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మోహన్‌లాల్ పోటీచేయొచ్చని కూడా కొందరు జోస్యం చెప్తున్నారు. అయితే అప్పుడే ఏదీ చేప్పలేమి బీజేపీ నాయకులు అంటున్నారు.

1229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles