శబరిమల వివాదంపై మోహన్ భగవత్ స్పందన

Thu,October 18, 2018 02:25 PM

Mohan Bhagwat responds on Sabarimala temple issue

నాగ్‌పూర్ : అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఇవాళ విజయ దశమి సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఎంతో కాలం నుంచి సమాజం, మహిళలు పాటిస్తున్న సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. శబరిమలలోకి మహిళలను అనుమతించే విషయంలో భక్తుల విశ్వాసాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న భగవత్.. ఈ విషయంలో కోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక అయోధ్యలో తక్షణమే రామమందిరం నిర్మించాలన్న ఆయన.. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు. 2019 ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి. కానీ రామమందిర నిర్మాణంలో రాజకీయాలు పక్కన పెట్టాలన్నారు మోహన్ భగవత్.

2198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS